1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (18:39 IST)

విమానంలో మహిళా వైద్యురాలిని అనుచితంగా తాకాడు..

flight
ఢిల్లీ-ముంబై విమానంలో మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై 47 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం జరిగినట్లు తెలిపారు
 
ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన విమానంలో 24 ఏళ్ల బాధితురాలు, నిందితులు పక్కపక్కనే కూర్చున్నారని పోలీసు అధికారి తెలిపారు. ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడానికి కొంత సమయం ముందు నిందితుడు తనను అనుచితంగా తాకాడని మహిళా డాక్టర్ తన ఫిర్యాదులో తెలిపారు.
 
ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరగడంతో బాధితురాలు విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో వారు జోక్యం చేసుకున్నారు. ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, వారు సహర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని చెప్పారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.