సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (08:11 IST)

అప్పు తీర్చలేదని భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం...

victim
తీసుకున్న అప్పు తీర్చలేదన్న అక్కసుతో కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఈ ఘటన ఫిబ్రవరి నెలలో జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కామాంధులు వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బహిర్గతమైంది. 
 
పూణెకు చెందిన బాధిత భార్యాభర్తలు ఇంతియాజ్ షేక్ అనే వ్యక్తి నుంచి కొంతకాలం క్రితం కొంత మొత్తంలో రుణం తీసుకున్నారు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేక పోయారు. ఈ క్రమంలో నిందితుడి మహిళ భర్తను కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాన్ని కామాంధులు వీడియో తీశారు. 
 
ఆతర్వాత పలుమార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎదురు చెప్పకపోవడంతో ఆ వీడియోను సోమాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. అతడి ఆగడాలను భరించలేని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.