శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (20:03 IST)

సజీవ మానవ హృదయాన్ని విమానంలో తరలించారు.. ఓ మహిళకు?

Heart
Heart
ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్‌లో చేరిన ఓ మహిళకు గుండె మార్పిడి చేసేందుకు బుధవారం ఉదయం నాగ్‌పూర్ నుండి పూణేకు IAF AN-32 విమానంలో సజీవ మానవ హృదయాన్ని తరలించారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన గ్రీన్ కారిడార్ ద్వారా గుండెను తరలించి అత్యంత వేగంగా పూణేకు తరలించారు. 
 
జైపూర్‌లోని SMS మెడికల్ కాలేజీ నుండి దానం చేసిన గుండెతో పాటు వైమానిక దళం వైద్య బృందాన్ని దేశ రాజధానిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించిన రెండు నెలల తర్వాత ఇది జరిగింది. 
IAF
IAF
 
వైమానిక దళం ఒక ప్రకటనలో, IAF బృందం మొదట వైద్య బృందాన్ని జైపూర్‌కు తరలించి, తిరిగి ఢిల్లీకి తీసుకువెళ్లిందని చెప్పారు. ఐఏఎఫ్ సకాలంలో ఆపరేషన్ నిర్వహించడం ఓ మహిళకు ప్రాణం పోసినట్లైంది.