శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (11:19 IST)

కుప్పకూలిన మిగ్ విమానం - ఇద్దరు పైలెట్లు మృతి

iaf plane
భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉత్తర్‌లాయ్ ఎయిర్‌పేస్ నుంచి ఈ విమానం బయలుదేరింది. భీమ్డా గ్రామం వద్ద గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. ఈ విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 
 
రెండు సీట్లున్న ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమాన శిథిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లాచెదురుగా పడిపోయినట్టు స్థానికులు తెలిపారు.