గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (17:27 IST)

రన్నింగ్‌లో పేలిన కారు టైరు... ట్రక్కును ఢీకొని ఐదుగురి దుర్మరణం

road accident
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ కారు టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఓ దర్గాలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌కు చెందిన ఓ కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతులను మొహ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మొహ్మద్ ఫరీద్, మొహ్మద్ సాగిర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు.