మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (13:19 IST)

పెళ్ళయిన గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

road accident
శ్రీకాళం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. వివాహమైన కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లి పసన ఆర్అండ్ఆర్ కాలనీలో జరిగింది. 
 
ఈ కాలనీకి చెందిన పవన్ కుమార్(20) అనే యువకుడు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ యువకుడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకుని, తన గ్రామానికీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు రాజీకి వచ్చి వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 17వ తేదీన స్వగ్రామంలో పెళ్లి జరిపించారు. 
 
పెళ్ళి తర్వాత వధువుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా బస్సులో సొంత గ్రామానికి బయలుదేరారు. కానీ, వరుడు పవన్ కుమార్ తన మేనమామ బలగం సోమేశ్వర రావుతో కలిసి బైకులో గ్రామానికి వెళుతుండగా, ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలో పెట్రోల్ బంకు వద్ద వీరి బైకను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెళ్లయిన గంటల వ్యవధిలోనే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.