సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (10:01 IST)

నల్లగొండ రోడ్డు ప్రమాదం: టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం

road accident
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల టీఆర్ఎస్ కీలక నాయకుడు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేశ్‌ రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎంను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న దినేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 
కాగా, రోడ్డు ప్రమాదంలో దినేష్ రెడ్డి మృతిచెందడం పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.