శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (19:59 IST)

నమీబియా నుంచి 12 చిరుతలు.. ఫిబ్రవరి 18న వచ్చేస్తున్నాయ్

Leopard
సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో 8 నమీబియా చిరుతపులిలను విడిచిపెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి 5 ఆడ, 3 మగ చిరుతపులులు వచ్చాయి. 
 
ప్రస్తుతం 2వ దశలో నమీబియా నుంచి 12 చిరుతలు వస్తున్నాయి. 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతపులులు గ్వాలియర్‌కు చేరుకుంటాయి. అనంతరం వాటిని కట్టుదిట్టమైన భద్రతతో కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేస్తారు.
 
వీటిలో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. 12 చిరుతలు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్‌లోని టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో వచ్చే శుక్రవారం సాయంత్రం బయలుదేరుతాయి.
 
ఇవి మరుసటి రోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకుంటుంది. మరో 30 నిమిషాల్లో వారిని హెలికాప్టర్‌లో షియోపూర్‌కు తరలించి, క్వారంటైన్ బోమాస్ (ఎన్‌క్లోజర్‌లలో) ఉంచుతామని కెఎన్‌పి డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు.