మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (13:14 IST)

పుస్తకరూపంలో శ్రీదేవి జీవిత చరిత్ర

sridevi
అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకరూపంలో రానుంది. ఆమె మరణించి ఐదేళ్లయిన తర్వాత ఈ పుస్తకం విడుదల కానుండటంతో అభిమానులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం పేరు శ్రీదేవి.. ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్. 
 
ఈ పుస్తకాన్ని ఆమె భర్త బోనీ కపూర్ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది.  ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ సంస్థ దీనిపై సర్వ హక్కులు కలిగి ఉంది. 
 
శ్రీదేవి బయోగ్రఫీపుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌తో పాటు బోనీ కపూర్‌ కూడా విడివిడిగా ఇన్‌స్టాగ్రాంలో  అధికారికంగా ప్రకటించారు. 
 
40 ఏళ్ల సినీ కెరీర్‌లో శ్రీదేవి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2013లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే, నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా అందుకున్నారు.