1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:10 IST)

ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై మిగ్ 29 యుద్ధ విమానాల ల్యాండింగ్

ins vikranth
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మరో అరుదైన ఘనతను సాధించాం. దేశీయంగా తయారుచేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై మిగ్ 29 యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. తద్వారా భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు విజయవంతంగా ల్యాండింగ్ చేశారు. 
 
స్వదేశీ యుద్ధ విమానాలు డిజైన్ చేయడంతో పాటు వాటిని పూర్తిస్థాయిలో తయారు చేసి స్వదేశీ టెక్నాలజీ తాయరు చేసిన యుద్ధ నౌకలపై సొంతంగా ల్యాడింగ్ చేసిన దేశంగా భారత్ అవతరించింది. ఇందులోభాగంగా, ట్రయల్స్ రన్‌ను నిర్వహించింది. ఇందులో తేజస్, మిగ్ 29కే లను భారత్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై విజయవంతంగా ల్యాడింగ్ చేసింది. 
 
భారత దేశ చరిత్రలో ఇది అరుదైన మైలురాయిగా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన 45 వేల టన్నుల బరువున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గత యేడాది సెప్టెంబరు నెలలో భారత్‌ నేవీలో ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌కు ఫైటర్ జెట్స్, విమానాలను దాదాపు 30 వరకు తీసుకెళ్లే సామర్థ్యం, సత్తా ఉంది.