ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (11:34 IST)

పెళ్లికి నిరాకరించిందని పార్కులో ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన యువకుడు

బంధువు, వరసకు మామయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఢిల్లీ యువతి నిరాకరించింది. అంతే ఆ యువకుడు 25 ఏళ్ల యువతిని ఇనుప రాడ్‌తో హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లోని అరబిందో కళాశాల సమీపంలోని పార్కులో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె మృతదేహానికి సమీపంలో ఒక ఇనుప రాడ్ కనుగొనబడిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. 
 
విచారణలో బాధితురాలి పేరు నర్గీస్ అని, ఆమె తన బంధువైన ఇర్ఫాన్ అనే వ్యక్తితో పార్క్‌లో కనిపించిందని తేలింది. నర్గీస్ మాల్వీయా నగర్‌లోని స్టెనోగ్రాఫర్ కోర్సుకు హాజరవుతున్నారని, ఈ ఏడాది ప్రారంభంలో కమలా నెహ్రూ కాలేజీలో చదువు పూర్తి చేసిందని పోలీసులు గుర్తించారు. 
 
ఈ కేసులో ఇర్ఫాన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అతని వద్ద జరిపిన విచారణలో, 28 ఏళ్ల ఇర్ఫాన్, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు, తాను నర్గీస్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అయితే తనకు సరైన ఉద్యోగం లేదనే కారణంతో ఆమె కుటుంబం నిరాకరించిందని చెప్పాడు.
 
నర్గీస్ కూడా అతనిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అతనితో మాట్లాడటం లేదా అతని కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానేసింది. దీంతో ఆమెను హత్య చేసినట్లు ఇర్ఫాన్ తెలిపాడు.