మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (11:24 IST)

తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే వద్దన్నాను.. అప్పలరాజు

food
ఏపీలోని కాకినాడ, రాజమహేంద్రవరంలో ఇప్పటికే మత్స్య ఆహార ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అయితే తిరుమలలో సీఫుడ్ ఫెస్టివల్ పెడదామంటే తాను వద్దన్నానని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 
 
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు జరిగే సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నెల్లూరు, విశాఖ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
కానీ తిరుమలలో కూడా సీపుడ్ ఫెస్టివల్ పెడదామని అనిల్ అన్నారు. తిరుమల వెళ్లి మాంసాహారం గురించి ప్రచారం చేస్తే బాగోదని.. వద్దన్నట్లు మంత్రి చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయం వున్న ప్రాంతంలో చేపలు, రొయ్యలు అంటే బాగుంటుందా అని ప్రశ్నించారు.