1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Akula Agavva Hospitalised after meals with kcr

సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం చేసిన ఆకుల అగ్గవ్వకు అస్వస్థత?

Akula Agavva
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంగళవారం సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
 
సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సీఎం సభ అనంతరం వాంతులు చేసుకుంది. రాత్రి మరోమారు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో గురువారం డిశ్చార్జ్  చేశారు.
 
సహపంక్తిలో భోజనం చేసిన ఓ బాలిక బుధవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జ్ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందించారు. 
 
గ్రామస్థుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని అధికారులు తెలిపారు. సహపంక్తిలో మొత్తం 2500 మంది పాల్గొన్నారని, వారిలో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు.
తర్వాతి కథనం
వచ్చే పదేళ్ళకు ఉపయోగపడేలా విండోస్ 11 ఆవిష్కరణ