1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. AP Minister Puvvada Ajay Kumar sensational comments on Bandi Sanjay

బీజేపీ ఓ అంటురోగం.. అంటుకుంటే వదలదు : మంత్రి పువ్వాడ

AP Minister Puvvada Ajay Kumar
భారతీయ జనతా పార్టీపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. బీజేపీ ఓ అంటు రోగం వంటిందన్నారు. అది అంటుకుంటే పోదన్నారు. అందువల్ల మంచి రోగ నిరోధక శక్తి ఉన్న ఖమ్మం ప్రజలకు ఇది అంటుకోదు. బిడ్డా బండి సంజయ్‌ 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై, మా మమతా మెడికల్‌ కళాశాలపై విచారణ జరిపిస్తా అని మాటలు పేలావు. ఇప్పుడు కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది. దమ్ముంటే నాపై విచారణ చేయించు.. నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. 
 
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నాలుగు ఓట్లు, నాలుగు సీట్ల కోసం చేసే వ్యక్తిగత దూషణలను నమ్మేస్థితిలో ఖమ్మం ప్రజలు లేరని స్పష్టం చేశారు. తన కుటుంబం గురించి ఖమ్మం ప్రజలకు తెలుసని, 22ఏళ్ల క్రితమే మమతా ఆసుపత్రి పెట్టి లక్షలాది మందికి వైద్యం అందించామని తెలిపారు. 
 
మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలోనే మమతా కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. ‘వ్యాక్సిన్‌ నాకు ఇవ్వడం కాదు.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో నా వ్యాక్సిన్‌ ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తా బిడ్డా’ అని సంజయ్‌ను ఉద్దేశించి అన్నారు. 
 
రాజకీయ టూరిస్టుల మాటలను ఖమ్మం ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్లతో రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, మాంసాహారం లభిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. 
తర్వాతి కథనం
మా అక్క అఖిల ప్రియ అరెస్టు వెనుక కుట్ర : భూమా మౌనికా రెడ్డి