1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Attack on Hindu Student saying Allah Hu Akbar video goes Viral

'అల్లా హు అక్బర్' అనాలంటూ హిందూ విద్యార్థిపై దాడి...

hindu student attack
హైదరాబాద్ నగరంలోని ఫౌండేషన్ ఫర్ హైయ్యర్ ఎడ్యకేషన్ (ఐసీఎఫ్ఏఐ) విద్యార్థి హిమాంక్ బన్సల్‌ను ఇనిస్టిట్యూట్‌లోని కొందరు ముస్లిం విద్యార్థులు అల్లా హు అక్బర్ అంటూ నినాదాలు చేయాలంటూ దారుణంగా కొడుతూ చిత్ర హింసలకు గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అయింది. 
 
ఈ వీడియోలో హాస్టల్ గదిలో బన్సల్‌‍ను కొందరు ముస్లిం యువకులు కొట్టడం, బెదిరించడం, పిరుదులతో తన్నడం, చెంపలపై వాయించడం వంటి దృశ్యాలను చూడొచ్చు. దాడి తర్వాత బన్సల్ ఈ ఘటనపై హైదరాబాద్ నగరంలోని శంకరంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇందులో తనపై దాడికి దారితీసిన పరిస్థితులను వివరించారు. దీంతో ఐపీసీ 307, 342, 450, 323, 506, ఆర్‌డబ్ల్యూ 149, ఐపీసీ సెక్షన్స్ 4(I), (II), (III) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. 

 
తర్వాతి కథనం
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి