1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Break for Fish Medicine distribution

కరోనా ఎఫెక్టు : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీకి బ్రేక్

Fish Medicine distribution
హైదరాబాద్ నగరంలో ప్రతి యేటా బత్తిని సోదరులు ఉబ్బసం రోగులకు పంపిణీ చేసే చేపల మందు ప్రసాదానికి ఈ యేడాది బ్రేక్ పడింది. తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. 
 
ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటం ప్రధాన కారణమన్నారు. ఈ నేపథ్యంలో మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. ఈసారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ చెప్పారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆనందయ్య శిష్యుడికి కరోనా పాజిటివ్.. మరో ఇద్దరికి కూడా..