1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Case Files On BJP MLA Raja Singh Over Comments On Ajmer Dargah

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

rajasingh
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రాజా సింగ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసునమోదు చేశారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అదీకూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలపై హైదరాబాద్ కంచన్ బాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
రాజాసింగ్ ఓ వీడియోలో సూఫీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. దీంతో ఘోషామహల్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 
తర్వాతి కథనం
Andhra Pradesh: 10th పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఎవరు?