1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Corona Patients Can come to Telangana from any state: DH

ఏ రాష్ట్రం నుంచైనా కరోనా రోగులు తెలంగాణకు రావచ్చు, కానీ...: డీహెచ్‌

Corona Patients
హైదరాబాద్‌: వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చే రోగులను సరిహద్దులోనే ఆపివేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
 
పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలి. దాదాపు 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో ఉండేవి. పడకలు లేకుండా వచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల ప్రభుత్వాలకు సీఎస్‌ లేఖ రాశారు.

ఆస్పత్రి వారే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. ఆ వివరాలను పరిశీలించి అనుమతిస్తాం. ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవటం లేదన్నారు.
తర్వాతి కథనం
హైదరాబాదులో ఏ హాస్పిటల్‌లో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి? ఎక్కడ దొరుకుతాయి? Full Details