ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (16:43 IST)

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో విషాదం, ఇద్దరు మృతి: ఇదేనా కేసీఆర్ ఆంధ్రకు చేసే న్యాయం

ఏపీ, తెలంగాణ మధ్య కోవిడ్ చికిత్స విషయంలో గందరగోళం నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అడ్డుకుంటున్నారు. అనుమతి లేదని చెప్పి పోలీసులు నిలిపివేస్తున్నారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో కర్నూలు సరిహద్దులో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఏపీ అంబులెన్స్‌లను అనుమతించకపోవడంతో చికిత్స అందక ఇద్దరు కోవిడ్ రోగులు మరణించారు.

నిన్న రాత్రి నుంచి అక్కడ 30 వరకు అంబులెన్స్‌లు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. అటు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణలోకి అంబులెన్స్‌లను అనుమతించడం లేదని ఏపీ వాసులు వాపోతున్నారు.