శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 13 మే 2021 (12:40 IST)

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తండ్రి కన్నుమూత: మంత్రి ఆదిమూలపు సంతాపం

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారి తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ గారు మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
వెల్లంపల్లి సూర్య నారాయణ గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ గారు మృతి పట్ల తీవ్ర సంతాపం...దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.
 
దుఃఖంలో ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారికిప్రగాఢ సానుభూతి తెలియచేశారు మంత్రి ఆళ్ల నాని. వెల్లంపల్లి సూర్య నారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నాను.
 
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారికి భగవంతుడు మనో దైర్యం ప్రసాధించాలని,
గుండె నిబ్బరం చేసుకొని యధావిధిగా వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు ప్రజా సేవలో కొనసాగాలని కోరుకున్నారు మంత్రి ఆళ్ల నాని.