మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:16 IST)

నిన్న కొడుకు, నేడు తండ్రి: కరోనా కాటుకు కడపలో సాక్షి జర్నలిస్ట్ ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస ఘటన

కడపలో సాక్షి రిపోర్టర్‌గా పని చేస్తూ కరోనా కాటుకు బలైన మాచూపల్లె ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుసగా జరిగిన దారుణ ఘటన ఇది.

నిన్న ప్రభాకర్ రెడ్డి కరోనాతో చనిపోగా, ఈ రోజు వారి తండ్రి ఓబుళరెడ్డి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్క రోజు తేడాతో తండ్రి, కొడుకు ఇద్దరూ అకాల మృత్యువాతపడ్డారు.

కనీసం చివరి చూపునకూ నోచుకోలేకపోయారు. బంధాలు, అనుబంధాలు నిర్దాక్షిణ్యంగా తెంపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలని మనవి.