సంబంధిత వార్తలు
- నా భర్తను చంపకుంటే నువ్వు నావద్దకు వద్దు... ప్రియుడికి వార్నంగ్... ఏం జరిగింది?
- కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిలిచిన ఆరోగ్య వైద్య సేవలు
- ఉపాధి ఉందని నమ్మించారు.. మహిళను తీసుకెళ్ళి అమ్మేశారు.. ఎక్కడ?
- ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్ ద్వారా స్పందించిన డీజీపీ
- రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం!
సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం: మూడు ఫ్యాక్టరీల్లో మంటలు
సంగారెడ్డి జిల్లాలోని పాశ మైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు. ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
పాశ మైలారం పారిశ్రామిక వాడలో పలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
ఈ ప్రమాదం జరిగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుండి మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు కూడ వ్యాపించాయి.
