రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం!
రైతులకు తీపి కబురు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతల కోసం పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. దీని పేరు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్. ఈ స్కీమ్‌లో చేరిన రైతులు నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై) స్కీమ్ రిజిస్ట్రేషన్స్‌ను ప్రారంభించింది. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ ఆరంభమైంది. ఈ పథకంలో నమోదు చేసుకోవడం వల్ల రైతులు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
2 హెక్టార్ల వరకు భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హలు. ఇది వాలంటరీ క్రంటిబ్యూషన్ ఆధారిత పెన్షన్ స్కీమ్. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు ఉచితం. అయితే సీఎస్‌సీ సెంటర్లు రూ.30 వసూలు చేస్తాయి.
అయితే కేంద్ర ప్రభుత్వమే ఈ డబ్బు చెల్లిస్తుంది. రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రాతిపదికన చెల్లించే మొత్తం మారుతుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తుంది. భర్యభర్తలిద్దరూ విడివిడిగా చెల్లించి విడివిడిగా పెన్షన్ పొందొచ్చు.
స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్‌కు ముందుగానే మరణిస్తే చెల్లించిన మొత్తాన్ని వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తారు. నామినీకి ఈ మొత్తం అందుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పెన్షన్ ఫండ్‌ను నిర్వహిస్తుంది.