1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Govt Chief Whip Koppula Eswar Car Met an Accident

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా

Koppula Eswar
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్‌గా గుర్తించారు. 
 
కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఉద్యోగం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. పలువురిచే లైంగిక దాడి చేయించాడు..?