మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (11:37 IST)

జయలలిత విగ్రహం కాదు.. సీఎం ఎడప్పాడి భార్య విగ్రహం!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. అయితే, ఈ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అది జయలలిత విగ్రహం కాదనీ, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి విగ్రహం అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
దీంతో, ఆ పార్టీ నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు. ఇలా జయలలిత లేని అన్నాడీఎంకే నేతలు మరోమారు అభాసుపాలయ్యారు.