#Halo Sun భాగ్యనగరంలో ఇంద్ర ధనుస్సు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Rainbow
హాలో సన్ అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంధ్రధనుసు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిపిసోతున్నారు. గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు.
ఇదిలా ఉంటే, సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని "22-డిగ్రీ హలోస్" అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.