బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (20:17 IST)

ఆనందయ్య ఉచితంగా మందు ఇస్తుంటే అభ్యంతరం ఎందుకు: చినజీయర్ స్వామి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన నాటు మందు వైద్యుడు ఆనందయ్య కరోనా రోగులకు ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే అభ్యంతరం ఎందుకు అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పందించారు. 
 
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుతో దుష్ప్రభావాల లాంటివి ఏవీ లేవని ఆయూష్‌ కమిటీ నిర్ధారించిందని అన్నారు. 
 
ఉచితంగా ఔషధం ఇస్తుంటే అభ్యంతరం ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనందయ్య ఔషధం కరోనా రోగుల ప్రాణాలను నిలబెడుతుంటే దాన్ని వివాదం చేయడం ఎందుకని చినజీయర్ స్పందించారు. సంక్షోభం వేళ వివాదాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆనందయ్య మందును పంపిణీ చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని సూచించారు.