సంబంధిత వార్తలు
- హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ ని పొందిన హీరో నాగ చైతన్య
- హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ నాన్ స్టాప్ షెడ్యూల్
- తెలంగాణాకు వర్ష సూచన... మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
- ఓ యువతి విషయంలో రెండు వర్గాల గొడవ... వివాదంలో సవాంగ్ కుమారుడు
- కాంగ్రెస్ విజయభేరీ సభ : ఆంక్షలతో సభకు అనుమతి
తెలంగాణాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు...
తెలంగాణ రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడిందని, ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిాపరు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి ఉండటంతోపాటు వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
ఈ కారణంగా రాష్ట్రంలో తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్ష సూచనలున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ఇదిలావుంటే, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో అత్యధికంగా 15.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
అదే జిల్లా కన్నేపల్లిలో 12.2, ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట 11.9, దహేగాం 11.2, భూపాలపల్లి జిల్లా పలిమెల 10.8, మహదేవపూర్ 10, ములుగు జిల్లా వాజేడు 8.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 7.7 సెం.మీటర్లు కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోనూ ఓ మోస్తరుగా పడ్డాయి.