1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (12:32 IST)

తెలంగాణాకు వర్ష సూచన... మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

rain
తెలంగాణా రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, గురు, శుక్రవారాల్లో ఉత్తర తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఎల్లో హెచ్చరికను జారీచేసింది. అలాగే, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించింది. 
 
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణాలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలుపడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణా జిల్లాలకు వచ్చే మూడు రోజుల పాటు, మిగిలిన జిల్లాలకు శనివారం రోజుకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో కూడా మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.