శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (12:54 IST)

సూర్యుడిపైకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం

Aditya-L1
Aditya-L1
సూర్యుడిపైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయాగించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్యను ప్రయోగించారు. ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసింది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం నాలుగు నెలల పాటు ప్రయాణించి సూర్యుడి దిశగా లగ్రాంజ్1 పాయింట్‌కు చేరుకుంటుంది.
 
చంద్రయాన్-3 విజయం తర్వాత రోజుల వ్యవధిలోనే సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం అయ్యింది.  ఇందులో భాగంగానే ఆదిత్యను ప్రయోగించింది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడిని ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సూర్యుడిపై సౌర తుపానులు, సౌర రేణువులు, దానిపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.  
 
ఆదిత్య-L1 సూర్యుని వివరణాత్మక అధ్యయనాన్ని నిర్వహించడానికి ఏడు వేర్వేరు పేలోడ్‌లను తీసుకువెళుతోంది. వీటిలో నాలుగు సూర్యుడి నుండి వచ్చే కాంతిని పరిశీలిస్తాయి. మిగిలిన మూడు ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల ఇన్-సిటు పారామితులను కొలుస్తాయి.
 
ప్రాథమిక పేలోడ్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, ఎల్1 చుట్టూ కక్ష్యకు చేరుకున్న తర్వాత విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు రోజుకు 1,440 చిత్రాలను పంపుతుంది.