సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (16:08 IST)

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. రద్దీ ఉండదు.. అడిషనల్ క్యారేజీలు

hyderabad metro
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రతి రైలుకు కేటాయించిన అదనపు క్యారేజీల సంఖ్యను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అడిషనల్ క్యారేజీలను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.
 
హైదరాబాద్‌లోని ఎల్‌ అండ్‌ టి మెట్రో గ్రూప్‌ ప్రతినిధులు చెన్నై, నాగ్‌పూర్‌ మెట్రో గ్రూపులకు చెందిన వారితో అదనపు క్యారేజీల ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించారు. 
 
నివేదికల ప్రకారం, ఆగస్టు నాటికి మూడు అదనపు క్యారేజీలు చేర్చబడతాయి. నాగోల్-రాయదుర్గ్, మియాపూర్ నుండి ఎల్‌బి నగర్ మార్గాలలో గణనీయమైన రద్దీ కారణంగా గత కొన్ని నెలలుగా క్యారేజీల సంఖ్యను పెంచాలని మెట్రో ప్రయాణికులు పట్టుబట్టారు.