గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (10:44 IST)

పెరిగిన తిరుపతి వందే భారత్ సీట్లు.. తగ్గిన ప్రయాణ సమయం

tirupati vande bharat
సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది. దీంతో ఈ రైలు ప్రారంభించిన అనతికాలంలోనే బోగీలను పెంచారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు బోగీల సంఖ్యను రెంట్టింపు చేసినట్టు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు వెల్లడించారు. అదేసమయంలో టైమింగ్‌లో కూడా స్పల్ప మార్పులు  చేశారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 బోగీలోతో ఈ రైలును నడుపుతున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు పరుగులు తీస్తుంది. అదేసమయంలో ఈ రైలు ప్రయాణ వేళల్లో కూడా స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 
 
ప్రతి రోజూ ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ రైలు నల్గొండకు ఉదయం7.29 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరుకు ఉదయం 9.35 గంటలకు, గుంటూరుకు మధ్యాహ్నం 11.15 గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి 14.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు ప్రయాణ సమయం 8.15 గంటలు పడుతుంది.