1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (15:53 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

hyderabad metro
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 12 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
అధికారిక వెబ్ సైట్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ లోకి వెళ్లాలి. కరెంట్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేసి మీకున్న అర్హతలతో పాటు అవసరమైన వివరాలను నమోదు చేయాలి.  
 
ఖాళీగా ఉన్న పోస్టులు..
ఏఎంఎస్ ఆఫీసర్ (1), సిగ్నలింగ్ టీమ్ (2), రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ (6), ట్రాక్స్ టీమ్ లీడర్ (2), ఐటీ ఆఫీసర్ (1).. అని మెట్రో ప్రకటించింది. ఇంకా అర్హతలను కూడా వెబ్ సైట్‌లో చూసుకోవచ్చునని హైదరాబాద్ మెట్రో తెలిపింది.