1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. on 25th of this month metro services will run upto mid night

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

hyderabad metro
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైల్ సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని నిర్ణయించింది. 
 
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో సిటీ బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో మెట్రో రైల్ సర్వీసులు నడపాలని హెచ్ఎంఆర్‌సీ నిర్ణయించింది. ఈ రైళ్లను కూడా క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచే అవకాశం ఉందని తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
న్యూడ్ వీడియో చూపించి బెదిరిస్తున్న యువతి.. ఎక్కడ?