సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:55 IST)

చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మెట్రో రైల్ డ్రైవర్

అప్పుల బాధను భరించలేక ఓ హైదరాబాద్ మెట్రో రైలు డ్రైవర్ ఒకరు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని గోల్నాకలో నివసించే తుంకి సందీప్ రాజ్ (25) అనే వ్యక్తి నాగోలులో మెట్రో రైలు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం అనేక మంది వద్ద అప్పులు చేశారు. 
 
అవి చివరకు కొండంత చేరాయి. వీటిని తీర్చే మార్గం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పైగా, అప్పులు తీర్చే మార్గం లేక, అప్పులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి రానని, డిపోలోనే ఉండిపోతానని చెప్పాడు. అయితే, ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో సందీప్ రాజ్ మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. 
 
తన కుమారుడు ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్ని తల్లి కుమిలిపోతు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. అయితే, తాను శనివారం ఆత్మహత్య చేసుకుంటానని తన స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్ చేసిన వాట్సాప్ సందేశాన్ని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.