మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:03 IST)

ఖమ్మంలో భాజపా కార్యకర్త ఆత్మహత్య, కారణం ఏంటి?

suicide
ఖమ్మంలో ఈ నెల 14న ఆత్మహత్యకు ప్రయత్నించిన భాజపా కార్యకర్త సాయి గణేష్ ఈ రోజు హైదరాబాదు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తనను పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ ఆరోపించిన గణేష్ ఈ నెల 14న పురుగులు మందు తాగాడు.

 
దాంతో అతడిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాదుకి తరలించారు. అక్కడ గత రెండురోజులుగా వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలించలేదు.

 
మరోవైపు సాయి గణేష్ మరణవార్త తెలియడంతో ఖమ్మంలో భాజపా శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం వద్ద, తెరాస కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.