గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (12:32 IST)

హైదరాబాద్ మెట్రోపిల్లర్ ఢీకొని ఇద్దరు మృతి

hyderabad metro
హైదరాబాద్‌లోని సోమాజీగూడలో మెట్రోపిల్లర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.  
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్‌పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజీగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. 
 
ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. 
 
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.