శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (12:56 IST)

తెలంగాణలో భారీ వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే..

Rains
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
ఈ వర్షాకాలంలో 20 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
మరోవైపు బుధవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షాల మధ్య, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 3,000 మందికి పైగా సిబ్బందితో కూడిన పౌర బృందాలను నగరవ్యాప్తంగా నీటి ఎద్దడిని తొలగించేలా చూసింది.
 
హైదరాబాద్‌లో, మంగళవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తుండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.