శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వివేకా హత్య కేసు : వైకాపా ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు

YS Bhaskar Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. సోమవారం కేసు విచారణలో భాగంగా, భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్‌కు కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన అరెస్టు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఇదే జైలులో ఉన్నారు.
 
కాగా, వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ యేడాది ఏప్రిల్ 16వ తేదీన భాస్కర్ రెడ్డిని కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అంతకుముందే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 
 
ఈ క్రమంలో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు సీబీఐ కోర్టును ఆశ్రయించగా, కోర్టు నిరాకరించింది. కింది కోర్టును తీర్పును వారిద్దరూ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిపిన కోర్టు... వారిద్దరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.ే