బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైకాపాకు ఇవే ఆఖరివా?

ap assembly
ఈ నెల 21 తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 10 గంటలకు శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు ఒక రోజు ముందే సీఎం జగన్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 
 
ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగుతాయని తెలుస్తుంది. అవసరాన్ని బట్టి మరో రెండు మూడు రోజులు పొడగించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇతర కీలకాంశాలకు సంబంధించి మరికొన్నిఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు, కొన్ని కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తుంది. 
 
అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వెనుక కూడా ఓ కుట్రదాగివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్కిల్ డెవలప్‌‍మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో దేశ వ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కక్షపూరిత చర్యలను తప్పుబడుతున్నారు. దీంతో తమపై పడిన మచ్చను కొంతమేరకైనా రూపు మాపేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని.. చంద్రబాబు తప్పు చేశారని చెప్పేందుకు ఉపయోగించుకునేలా ప్లాన్ చేశారు.