శుక్రవారం, 12 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:14 IST)

ఏపీ మంత్రి వర్గ సమావేశం...

jagan
ఏపీ మంత్రి వర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐపీబీ ఆమోదించిన భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అలాగే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 
 
విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌పై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టులో జిందాల్ కంపెనీకి బెర్త్‌లు అప్పగించడంపైనా చర్చ జరుగనుంది. 
 
మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకు పెంచుతూ మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.