కిచ్చ సుదీప్, అమలాపాల్ హెబ్బులి విడుదలజి సిద్ధం
prasanna, c. kalyan and others
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కన్నడలో హెబ్బులి సూపర్ కలెక్షన్లు సాధించింది. కాబట్టి నేను కూడా ఓ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇక్కడ కొన్నాను అన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ విక్రాంత్ రోణా కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాము. మరో నాలుగయిదు చిత్రాలు విడుదలకావలసి ఉన్నాయి. అవన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
సీ.కళ్యాణ్ మాట్లాడుతూ, ఎక్కడో పుట్టి ఇండస్ట్రీలో కలిసి పదవులను ఎంజాయ్ చేస్తున్నాము. అలాంటిది పక్కవాళ్లకి సహాయం చేయాలి, సినిమాలు తీయాలి. .డబ్బులు పోగొట్టుకోకూడదు. మూవీ కొన్నందుకు నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
