గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (12:49 IST)

క‌ళ్యాణ్‌రామ్, ఆషికా రంగ‌నాథ్‌ నటించిన అమిగోస్ నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. సాంగ్

Kalyan Ram and Aashika Ranganath
Kalyan Ram and Aashika Ranganath
నంద‌మూరి బాల‌కృష్ణ‌ నటించిన ధర్మ క్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. సాంగ్ ను నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్, ఆషికా రంగ‌నాథ్‌ పై రీమిక్స్ చేసారు. ఈ పాటకు చెందిన శాంపిల్ నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈవెనింగ్ కల్లా పూర్తి పాట విడుదల చేయనున్నారు. ఈ ఐకానిక్ సాంగ్‌లో న‌టించ‌టం ల‌క్కీగా ఫీల్ అవుతున్నాను. ఈజీగా ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతాన‌నిపించింది. క‌చ్చితంగా నారోల్ అంద‌రికీ న‌చ్చుతుందని ఆషికా రంగ‌నాథ్‌ తెలిపారు. 
 
Kalyan Ram and Aashika Ranganath
Kalyan Ram and Aashika Ranganath
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది.