శనివారం, 2 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (13:57 IST)

బెంగళూరులోని రింగ్‌రోడ్‌కు పునీత్ రాజ్‌కుమార్ పేరు

Puneeth Raj kumar
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ పేరును బెంగళూరులోని రింగ్‌రోడ్‌కుపెట్టి కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై రింగ్‌రోడ్డును ప్రారంభిస్తున్నారు. 
 
మైసూరు రోడ్డు నుంచి బ్యానర్ ఘాట్ రోడ్డు వరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ పునీత్‌ సామాజిక సేవలో నిమగ్నమైన మానవతాది అని కొనియాడారు.
 
ప్రకటనల కోసం స్టార్లు కోట్లు వసూలు చేస్తారు. కానీ రైతులకు సహాయం చేయడానికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా సహకార కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన నందిని మిల్క్‌కు పునీత్ అంబాసిడర్‌గా మారారని అశోక్ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో కన్నడ సూపర్‌స్టార్‌, పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, పునీత్‌ భార్య అశ్విని పునీత్‌రాజ్‌కుమార్‌లు పాల్గొంటున్నారు.