సంబంధిత వార్తలు
- వేలేరుపాడులో వైద్యం వికటించి బాలింత మృతి : వైద్య మంత్రి సీరియస్
- భర్త గల్ఫ్‌లో భార్యకు విడాకులు.. వదినను వదిలించుకోలేని మరిది.. చివరికి?
- పంచాయతీ పోల్ : ఓటర్ల జాబితా అడ్డుగా పెట్టుకుని హైకోర్టులో పిటిషన్
- అమెరికాలో కాల్పుల కలకలం .. ఆరుగురి మృతి
- శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది..
లేడి కిలేడీ.. పెళ్లికి 2 రోజుల ముందు ఫోన్ స్విచ్ఛాఫ్.. 12 లక్షలు టోకరా
పెళ్లిపేరుతో జరిగే మోసాలను ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో పరిచయాలు మంచివి కాదని, అటువంటి పరిచయాలు ఆర్ధిక ఇబ్బందులకు గురి చేస్తాయని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘరానా మోసం ఒకటి ఇటీవలే బయటపడింది.
హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి సోషల్ మీడియాలో వర్ణన మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
పెళ్ళికి సిద్దమవ్వగానే ఆ యువతి తన అసలు రంగు బయటపెట్టింది యువకుడి వద్ద నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. అనేక కారణాలు చూపించి దాదాపుగా 14 లక్షల వరకు వసూలు చేసింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి యువకుడు అడిగిన డబ్బులు పంపించాడు. అయితే, పెళ్ళికి రెండు రోజుల సమయం ఉందనగా, యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.