సంబంధిత వార్తలు
- రైతుల ఉసురు తీస్తున్నారు : లఖింపూర్ ఖైరీ ఘటనపై కేటీఆర్ ట్వీట్
- కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలాన్... ఎస్ఐ, కానిస్టేబుల్‌కు మంత్రి అభినందన
- TRS నేతలకు KTR క్లాస్: విపక్షాలు విమర్శిస్తుంటే కౌంటర్ ఇవ్వలేరా?
- ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా.. జేసీ దివాకర్ రెడ్డి
- రానా, రకుల్‌ని ఈడీ పిలిస్తే... కేటీఆర్‌కు ఎందుకు ఉలికిపాటు?
పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి కేటీఆర్ ఆర్థిక సహకారం
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.
అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నారు. తన వైద్య విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది.
తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్ గా, వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు.
అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్, కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలన్నారు. ఈ సందర్భంగా అనూష కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.