సంబంధిత వార్తలు
- 'హార్టీ కంగ్రాచ్యులేషన్' కేటీఆర్.. థ్యాంక్యూ బావా
- కేసీఆర్‌ని ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు... పీపుల్ స్టార్ వ్యాఖ్య
- కేసీఆర్ విజయంపై భూమా అఖిలప్రియ ట్వీట్స్... తెదేపాలో కలకలం
- కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయం... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. రేవంత్‌కు పోటీనా?
కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌కు నో ఛాన్స్.. నంబర్ 2గా హరీష్
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్‌కు ప్రమోషన్ కల్పించారు.
ఇటీవలి ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కేటీఆర్‌కు వర్కింగ్ ప్రమోషన్ దక్కడంతో.. కాబోయే సీఎం ఆయనే అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో ఆయనకు స్థానం ఉండకపోవచ్చునన్న ప్రచారం కూడా జోరందుకుంది.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, క్షేత్రస్థాయిలో కేడర్ బలోపేతంపైనే కేటీఆర్ ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఐదారు నెలల పాటు ఆయన ఈ పనులతోనే బిజీగా ఉండనున్నారు.
కాబట్టి మంత్రివర్గంలోకి కేటీఆర్‌ను తీసుకుంటే పార్టీ పనులపై ఫోకస్ చేయడం కష్టమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి కేటీఆర్‌ను సీఎం చేసి.. కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారన్న వాదన వినిపిస్తోంది.
అంతేకాదు, ఈసారి డిప్యూటీ సీఎం పదవిని మహమూద్ అలీకే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీకి తొలి నుంచి వీర విధేయులుగా ఉన్నవారికే ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
తర్వాతి కథనం
