శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:36 IST)

'హార్టీ కంగ్రాచ్యులేషన్' కేటీఆర్.. థ్యాంక్యూ బావా

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. దీంతో ఆయనకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతగా ఉన్న తన్నీర్ హరీశ్ రావు ఎలా స్పందిస్తారోనని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. 
 
దీనికి హరీష్ రావు తనదైనశైలిలో, మంచి పరిణితితో సమాధానం ఇచ్చారు. హార్టీ కంగ్రాచ్యులేషన్ టు కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తోనే హరీష్ రావు సమాధానమిచ్చారు. 
 
ఇదిలావుంటే, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. బావ హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. కేటీఆర్ వెంట తెరాస ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. కేటీఆర్ వెళ్లే సమయానికి హరీశ్ రావు నివాసంలో లేరు. దీంతో హరీశ్ కోసం కేటీఆర్ కొద్దిసేపు వెయిట్ చేశారు. 
 
ఆ తర్వాత ఇంటికి వచ్చిన హరీశ్ రావు.. కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పిమ్మట మిగిలిన ఇద్దరినీ బయటకు పంపించిన హరీశ్ రావు, కేటీఆర్‌తో కొద్దిసేపు చర్చించారు.