శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (09:52 IST)

కొడంగల్‌లో రేవంత్ రెడ్డి వెనుకంజ.. సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజ..

తెలంగాణ రాష్ట్రలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ ఏడో తేదీన జరిగిన ఎన్నికల ఫలితాల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గంలో వెనుకంజలో వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో వుండగా.. ఓట్ల లెక్కింపు విధుల్లో దాదాపు 40వేలకు పైగా సిబ్బంది వున్నారు.  
 
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో వెనుకంజలో వున్నారు. మొదటి రౌండ్ వరకు ముందంజలో ఉన్న ఆయన ఇప్పడు కాస్త వెనకపడ్డారు. తన ప్రత్యర్థి పట్నం నాగేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ,. జానారెడ్డిలు కూడా వెనుకంజలో వున్నారు.
 
అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల ఫలితాల్లో ముందుకు దూసుకపోతోంది. సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచి హరీష్ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇంకా మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి హరీష్ రావు 19,925 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.