1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Landslides are broken due to Rains in Yadadri

యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు

Landslides
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో యాదాద్రి ఒకరి. ఈ ఆలయ పునర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
 
కాగా ఇటీవల యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ నిర్మాణ పనులను అధికారులు పకడ్బందీగా నిర్వహించకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణాలో భారీ వర్షాలు : కడెం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత